లోతట్టు, నదిపరివాహన ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి :: రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్

లోతట్టు, నదిపరివాహన ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి :: రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాల వలన లోతట్టు, నదిపరివాహన ప్రాంతాలలో వరదలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శీ సోమేష్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వలన సంబంవించే నష్టాలను సమర్దవంతంగా ఎదుర్కోవడంలో అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలపై సోమవారం హైదరాబాద్ బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు ఎస్పిలు మరియు నీటిపారుదల శాఖ ఇంజనీర్ లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహెంద్ రెడ్డి లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరగనున్న తరుణంలో అధికారులు అప్రమత్తమై యుద్ద ప్రాతిపదికన ముందస్తు సహయక చర్యలు అందించడానికి సిద్దంగా ఉండాలని పేర్కోన్నారు. వరద ఉదృతిపై ఎప్పటికప్పుడు నీటిపారుదల, విద్యూత్ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి తక్షణ సహాయక చర్యలు అందించడానికి సిద్దంగా ఉండాలని అన్నారు. గ్రామాలలో సర్పంచులు, పంచాయితి కార్యదర్శులను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత/పునరావాస ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలోని ప్రజలకు ఆహారం, మంచినీరు అందించేలా చూడాలని.

ముంపునకు గరయ్యే బ్రిడ్జీలు, రహదారులు మరియు పర్యాటక ప్రాంతాలను పూర్తిగా మూసివేసి అటువైపుగా రాకపోకలను నిలిపివేయాలని, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా దారులను మళ్లించాలని సూచించారు. మూసివేసిన ప్రాంతాలవైపుగా ఎవరు రాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్దంచేసుకోవాలని అన్నారు. మంగళవారం 31న ప్రభుత్వసెలవు కావడంతో, క్షేత్రస్థాయి, సంబంధిత అధికారులందరు కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని, జిల్లాలో పరిస్థితులపై ఎప్పటికప్పడు టెలికాన్ఫరెన్స్ ల ద్వారా సమీక్షించుకోవాలని, గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సహయక, నష్టనివారణ చర్యలను చేపట్టాలని సూచించారు

హైదరాబాద్ నుండి ఈ వీడియోకాన్ఫరెన్స్ లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి శ్రీ సంజయ్ కుమార్ జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా , వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ S.A.M.రిజ్వీ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, CDMA శ్రీ యన్.సత్యనారాయణ, NDRF శ్రీ దామోదర్ సింగ్ తదితరులు పాల్గొన్నగా,

జిల్లా నుండి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ హరి సింగ్, DCP వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .

Share This Post