వందశాతం కోవిడ్ వ్యాక్సిన్ అందించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 16, 2021ఆదిలాబాదు:-

అర్హత గల వారందరు కోవిడ్ వ్యాక్సినేషన్ ను తప్పని సరిగా తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నంబర్ 48 , 45 , ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని భీంసారి గ్రామం లలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి దుష్పరిణామాలు రావని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని అన్నారు. ఐకేపీ, మెడికల్ సిబ్బంది ఇంటింటి సర్వ్ నిర్వహిస్తూ, వ్యాక్సిన్ తీసుకొని వారందరికీ అవగాహన కల్పిస్తూ, వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో మరో కోటి మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం ఆ దిశగా కార్యక్రమాలను రూపొందించి జిల్లాల వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను ప్రోత్సహిస్తూ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో సుమారు 4.50 లక్షల మంది 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ అందించడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ప్రతి కేంద్రంలో 200 నుండి 400 మంది వరకు ప్రతి రోజు వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమం జరిగే విధంగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని అన్నారు. గ్రామాలలోని సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ, మండల అధికారులు,  అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని వార్డ్ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలను చైతన్య వంతులు చేస్తూ ప్రజలను ప్రోత్సహిచాలని కోరారు. ప్రతి కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో వైద్యం, అంగన్వాడీ, ఆశ, స్థానిక పంచాయితీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి సిబ్బంది లతో టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహించేలా యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయ సారథి, వార్డ్ కౌన్సిలర్లు ప్రకాష్, బండారి సతీష్, ప్రత్యేక అధికారులు వెంకటేశ్వర్లు, పద్మభూషణ్ రాజు, మున్సిపల్ కమీషనర్ శైలజ, ఆదిలాబాద్ ఎంపీడీఓ శివలాల్, సర్పంచ్ మయూర్ చంద్ర, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post