వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విద్యార్థులను సూచించారు

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విద్యార్థులను సూచించారు.  మంగళవారం నుండి 5,6,7వ తరగతి  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను బాలికలకు గిరిజన ఆశ్రమ పాఠశాల, కల్వకుర్తి లో నిర్వహించగా బాలురకు ఏకలవ్య మోడల్ స్కూల్ వెలదండలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ హాజరై సెంటర్లను పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఆంగ్లము, లెక్కల సబ్జెక్టు లో  విద్యార్థులకు ఉన్న భయాలను పోగొట్టేందుకు ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  ఈ శిక్షణ తరగతులు నేటి నుండి 15 రోజుల పాటు ఉంటాయని ఇక్కడ లెక్కలు, భాషల పై భయాన్ని పోగొట్టడమే కాకుండా ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు.  ఈ పదిహేను రోజుల్లో పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం జరుగుతుందన్నారు.  శిక్షణ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ కన్వీనర్ మాధవరెడ్డి పిల్లల్లో ఉత్సాహం నింపేవిధంగా కథలు విజ్ఞానాన విషయాలను చెప్పారు.

ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ గోవిందరాజులు, పి.ఓ ఐ.టి డి.ఏ అశోక్, డిపిఆర్ఓ సీతారాం, ఎంఇఓ బాసు నాయక్,  ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఎన్. సరస్వతి, ఎం.ఈ.ఓ వెలదండ శంకర్ నాయక్ , విద్యార్తులు పాల్గొన్నారు.

Share This Post