*వంద పడకల దవాఖానాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా

*వంద పడకల దవాఖానాను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా

*ప్రచురణార్థం-2*.

*వంద పడకల దవాఖానాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా*

జయశంకర్ భూపాలపల్లి, మే 7: భూపాలపల్లి లో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం సందర్శించారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నందున ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేయనున్న ఆర్టీపిసిఆర్, న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు పనులకు మంత్రి తన పర్యటనలో శంఖుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. శ్రీరామ్, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సామ్యూల్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు వున్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post