వంద శాతం వాక్సినేషన్ పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 25: సోమవారం రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా నివారణ కోసం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేంగంగా లక్ష్యం దిశగా వైద్య సిబ్బంది అన్ని విభాగాలు, గ్రామాలలోని యువజన సంఘాల, ప్రజా ప్రతినిధుల సహాయంతో జిల్లా, మండలంలోని అన్ని గ్రామాలకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ. మహేందర్, డిపిఓ రంగాచారి,సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయడమైనది.

Share This Post