వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలు* *గ్రామ, మండలాల వారీగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసినట్లు ప్రకటించాలి* *పేద రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉత్తమ వైద్య సేవలు అందించాలి* *డాక్టర్లు సమయ పాలన పాటించాలి* *రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు*

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలు* *గ్రామ, మండలాల వారీగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసినట్లు ప్రకటించాలి* *పేద రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉత్తమ వైద్య సేవలు అందించాలి* *డాక్టర్లు సమయ పాలన పాటించాలి* *రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు*

*వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలు*
*గ్రామ, మండలాల వారీగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసినట్లు ప్రకటించాలి*
*పేద రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉత్తమ వైద్య సేవలు అందించాలి*
*డాక్టర్లు సమయ పాలన పాటించాలి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 13: కోవిడ్ వ్యాక్సినేషన్ ను వేగవంతంగా వంద శాతం పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ లతో కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు, ఆసుపత్రుల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొదటి ఒక కోటి వ్యాక్సిన్ డోసులను 165 రోజుల్లో, 2వ కోటి వ్యాక్సిన్ డోసులను 72 రోజుల్లో, 3 వ కోటి వ్యాక్సిన్ డోసులను 27 రోజుల్లో పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఇంకనూ కోవిడ్ ముప్పు తొలగిపోలేదని సింగపూర్, యూకే, రష్యా, చైనా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, కొన్ని దేశాలలో లాక్ డౌన్ కూడా కొనసాగుతుందని అన్నారు. కోవిడ్ నియంత్రణకు కోవిడ్ వ్యాక్సిన్ చాలా ముఖ్యమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన అన్నారు. కొన్ని జిల్లాల్లో మొదటి డోసు 95 శాతం, కొన్ని జిల్లాల్లో 65 శాతం జరిగిందని ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా ప్రత్యేక వ్యాక్సినేషన్ టీంలు పంపించి ఇంటింటి సర్వే చేసి ఇంటిలో అందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు గుర్తించి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించాలని అన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ప్రకటించిన గ్రామాలకు, మండలాలకు రాష్ట్ర స్థాయి నుండి ప్రత్యేక బృందాలను పంపించి తనిఖీ చేయిస్తామని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందించి ప్రజల మన్నలను పొందాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య వైద్య కెంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చామని, ఆసుపత్రులలో ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అన్ని ఖరీదైన ఎక్విప్ మెంట్లు సమకూర్చామని, ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేశామని, డయాలసిస్ సెంటర్లు, టీ-డయాగ్నోసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బందిని నియమించామని అన్నారు. అయిననూ పేద రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లుచున్నట్లు తమ దృష్టికి వచ్చినదని అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్య సదుపాయాలని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించి పేద ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందేలా చర్యలు గైకొనాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు పర్యటన సమయంలో పి.హెచ్.సిలను, సి.హెచ్.సిలను , జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో ఉన్న ఎక్విప్ మెంట్లు అన్ని సరిగా పనిచేస్తున్నవి లేనిది రివ్యూ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎంత మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సర్జన్ లు ఉన్నారని, వారందరూ ప్రతి నెల ఎన్ని ఆపరేషన్లు చేశారు, ఎంతమందికి వైద్య సేవలు అందించారో ప్రతి నెల డాక్టర్ ల వారీగా, ఏ.ఎన్.ఎం, ఆశా వర్కర్ల వారీగా, సిబ్బంది వారీగా రివ్యూ చేయాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని పి.హెచ్.సిలలో డాక్టర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు డాక్టర్లు విధులు నిర్వహించాలని అన్నారు. మెడికల్ కాలేజిలలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ లో 946 రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నవని, కొత్తగా ఆయుష్మాన్ భారత్ ను ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవేశ పెట్టామని, ఆయుష్మాన్ భారత్ లో 646 కొత్తగా శస్త్ర చికిత్సలు చేయుటకు అవకాశం ఉందని, ఇవి ప్రైవేట్ ఆసుపత్రులలో లేవని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చు రోగులను డాక్టర్లు, సిబ్బంది చిరునవ్వుతో పలకరించి వారి అనారోగ్య సమస్యలను తెలుసుకుంటే సగం రోగం పోతుందని, డాక్టర్లపై, సిబ్బందిపై రోగులలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రులలో శానిటేషన్ కాంట్రాక్టర్ ఒప్పందం మేరకు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారా లేదా అనేది ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రులలో రోగులకు అందించు భోజనం నాణ్యత ప్రమాణాలతో ఉన్నది లేనిది జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లు క్రమంగా తనిఖీ చేస్తూ రుచి చూడాలని ఆదేశించారు. జిల్లాలలో హోమియో, ఆయుర్వేదిక్, యునాని ఆసుపత్రులు ఉన్నాయని వారు అందించే వైద్య సేవలపై తనిఖీలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో మలేరియా, టీబి, లెప్రసి, మొదలగు విభాగాలు కలవని వీటిని సమర్థవంతంగా పని చేసేలా తగిన చర్యలు గైకొనాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఆస్పత్రులపై సమీక్షించారు. మొదటి డోస్ తీసుకుని, రెండవ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే వారం రోజుల్లోగా వారికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఆశా, ఏఎన్ఎం లతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ప్రతీ మండలానికి ఒక ప్రోగ్రామ్ అధికారిణి ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ప్రత్యేక అధికారిగా నియమించాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్సరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, వైద్యులు, ప్రోగ్రామ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post