వచ్చే జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శంకర్ శశాంక్ గోయల్ తెలిపారు

బుధవారం నాడు నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన ఈవీఎం, వివి ప్యాట్ గోడౌన్ భవనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 22 జిల్లాలలో ఈవీఎం, వివి ప్యాట్ గోడౌన్లు శాంక్షన్ కావడం జరిగిందని,  వీటిలో 20 పూర్తి చేసుకున్నామని,  కామారెడ్డి, నారాయణపేట జిల్లాలలో ఈనెల చివరిలోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎం,  వి.వి. ప్యాట్ల భద్రత  కోసం ఎలక్షన్ కమిషన్ గోదాముల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.  యాదాద్రి జిల్లాలో యంత్రాల టెస్టింగ్ విభాగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరములు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రత్యేక ఓటరు సవరణ జాబితా కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను సవరించాలని,  పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్, పోలింగ్ కేంద్రాల జిఐఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు  సమాచారాన్ని పరిశీలించాలని సూచించారు.  అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2022 న తుది ఓటరు జాబితా రూపొందించాలని ఆయన తెలిపారు.  పాఠశాలలు, కళాశాలల్లో  ఓటు హక్కు ప్రాముఖ్యతపై  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను  రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, బూత్ లెవల్ అధికారులు గరుడ యాప్ ద్వారా పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని,  ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్  వినియోగిస్తూ పరిష్కరించాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ,  జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్.డి.ఓ. సూరజ్ కుమార్, ఆర్. అండ్ బి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  శంకరయ్య, భువనగిరి తహసీల్దార్ శ్యాంసుఃదర్ రెడ్డి, తహసిల్దార్లు, రెవెన్యూ,  ఆర్. అండ్ బి. అధికారులు పాల్గొన్నారు.

వచ్చే జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శంకర్ శశాంక్ గోయల్ తెలిపారు

Share This Post