వచ్చే నెల అక్టోబర్ 16 న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాల,కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ లతో,డి.ఈ. ఓ,జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.జిల్లా కేంద్రం లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన 49 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల ల యాజమాన్యాలు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన సౌకర్యాలు పర్నిచర్,విద్యుత్,త్రాగు నీరు సదుపాయాలు కల్పించాలని అన్నారు.జిల్లాలో 16088 మంది పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. అదే విధంగా పరీక్ష జరిగే  గదులలో సి.సి.టి.వి. కెమెరా లు ఏర్పాటు చేయాలని అన్నారు.కళాశాల,పాఠశాల వారీగా ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు,సి.సి.టి.వి.కెమెరాలు లభ్యత పై సమీక్షించి అక్టోబర్ 5 లోగా ఏర్పాటు చేయాల హుని సూచించారు.అవసరమైతే అధికారులతో కలిసి తాను స్వయంగా సంబంధిత సెంటర్ పరిశీలిస్తానని అన్నారు.ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,ఇంటర్మీడియట్ విద్య అధికారి దస్రు నాయక్,జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

వచ్చే నెల అక్టోబర్ 16 న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.

Share This Post