వచ్చే నెల 12, 13వ తేదీలలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు విచ్చేయు భక్తులు సంతృప్తి చెందే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఏకాదశి ఉత్సవాలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించు ప్రదేశంతో పాటు ఆలయం, స్నానఘట్టాలు, వైకుంఠద్వారం, కళ్యాణ మండపం చుట్టూ, అలాగే భక్తులకు స్వామి వారి ప్రసాదాలు విక్రయాలు నిర్వహించు ప్రాంతాల్లో రద్దీ నియంత్రణకు పటిష్టమైన, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. తెప్పోత్సవానికి స్వామి వారిని తీసుకొచ్చే మార్గంలో వారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గోదావరిలో స్వామివారు హంస వాహనంలో ఊరేగింపు నిర్వహణకు నీరు తక్కువగా ఉన్నట్లయితే దుమ్ముగూడెం ప్రాజెక్టు నుండి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లులో భక్తులకు మంచినీరు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులు బట్టలు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణం ఆసాంతం పండుగ శోభను సంతరించుకునే విధంగా విద్యుద్దీకరణ చేయాలని చెప్పారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో భాగంగా వర్తక వ్యాపారాలతో సమావేశం నిర్వహించి వ్యర్థాలు బోస్ట్ బిన్స్ వేయు విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య పనివారలతో పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉంచే విధంగా పారిశుధ్య కార్యక్రమాలు – నిర్వహించాలని చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నియంత్రణ చేసేందుకు ప్రమాద హెచ్చరికల బోర్డులతో పాటు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉ చాలని చెప్పారు. ఉత్సవాలకు విచ్చేయు భక్తులు వాహనాలు నిలుపుదల చేసేందుకు పార్కింగ్ కొరకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలని, పార్కింగ్ ప్రాంతం భక్తులు తెలుసుకోవడానికి వీలుగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. కరకట్టను అందంగా విద్యుద్దీకరణ చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఏదేని పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా భక్తులు ఇబ్బంది పడకుండా జనరేటరు అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు. విద్యుత్ ఏర్పాట్లును పరిశీలించి తనిఖీ నివేదికలు అందచేయాలని చెప్పారు. అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలు నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించడంతో పాటు అత్యవసర సేవల వినియోగానికి చెర్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భద్రాచలం విచ్చేయు భక్తులకు తగు సమాచారాన్ని అందించుటలో భాగంగా ప్రధాన కూడళ్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ ను ఆదేశించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుటకు ప్రతి సెక్టారుకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 15 వరకు ప్రత్యేక అధికారుల నియామకం ప్రక్రియ పూర్తి అవుతుందని, అధిక వారికి కేటాయించిన విధులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ శివాజీ, ఎఎస్సీ ప్రసాద్, డిఆర్ మధుసూదన్జు, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, డివీఓ రమాకాంత్, ఇన్నీ సిఈఓ విద్యాంత, వైద్యాధికారి డాక్టర్ శిరీష, పిఆర్ ఈఈ సుధాకర్, అగ్నిమాపక అధికారి క్రాంతికుమార్, కార్తీక స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Share This Post