వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల రూపురేఖలు మారాలన్న జిల్లా కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల రూపురేఖలు మారాలన్న జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం
గూడూరు/ మహబూబాబాద్ 13 మే 2022

వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల రూపురేఖలు మారాలన్న జిల్లా కలెక్టర్

గ్రామ ప్రజలు సమిష్టి కృషితో ఊరు బడులను కాపాడాలన్న జిల్లా కలెక్టర్

శుక్రవారం మధ్యాహ్నం గూడూరు మండలంలో మన ఊరు మన బడి లో ఎంపిక చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హరితహారం నర్సరీ పొనుగోడు, జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల మాచర్ల, ప్రాథమికోన్నత పాఠశాల కొల్లాపురం పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆయా పాఠశాలల్లో కల్పించవలసిన వసతులను అదనపు నిర్మాణాలను పరిశీలించారు.

మన ఊరు మన బడి ఈ కార్యక్రమంలో ఊరి బడిని కాపాడుటకు ప్రాధాన్యత కల్పించి వేరే పాఠశాలలకు వెళ్లకుండా గ్రామ ప్రజలందరూ సమిష్టి కృషితో మన ఊరు మనబడి ప్రణాళికలో ఎంపిక కాబడిన మండలంలోని 21 పాఠశాలల్లో చేపట్టవలసిన పనులను త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని అవసరం మేరకు కావలసిన అదనపు గదులను ఫర్నిచర్, గ్రీన్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ లను ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడుకునేట్లు టాయిలెట్ల నిర్మాణం, ఆట స్థలాలు పనులను వెంటనే చేపట్టాలని, శిధిలావస్థలో ఉన్న గదులను తొలగించాలని, మరమ్మతులు చేయవలసిన వాటిని వెంటనే కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, డైనింగ్ కాల్ నిర్మాణాలు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు మోడల్ విద్యాలయాలుగా ఆంగ్ల మాధ్యమంతో మౌలిక వసతులు కల్పించుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పొనుగోడు లో ముగ్గురికి 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 503మంది స్ట్రెంత్ ఉన్నట్లు, అదనపు గదుల కోసం పక్కన వ్యవసాయ భూమిని కొనుగోలు చేయుటకు అనుమతించాలని పాఠశాలలను అప్గ్రేడ్ చేయాలని, పాఠశాలకు కావలసిన అవసరాలను కలెక్టర్ గారి దృష్టికి తెలుపగా పాఠశాల ఆవరణలోని గదులను పరిశీలించారు. పదోతరగతి లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులతో సమావేశమై కావలసిన అవసరాలు, ఎలాంటి సమస్యలు, వారి యొక్క జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. మనకు వారు కోరిన విధంగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మనం ఎంచుకునే వృత్తికి భవిష్యత్తు ఉందా లేదా అని నిర్ణయించుకోవాలని, ఒక పుస్తకం చదివితే 50 ప్రదేశాలు తిరిగినట్లని, 100 మంది మాట్లాడినంత జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని అన్నారు. స్ట్రెంత్ పెంచుకోవాలని ప్రైవేటుకు వెళ్లకుండా గ్రామస్తులు నిర్ణయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు గ్రామం లోని ప్రతి విద్యార్థి డేటా నమోదు చేయాలని, మరి ఏ పాఠశాలకు వెళ్తున్నారని అట్టి వివరాలు పొందుపర్చాలని కలెక్టర్ తెలిపారు.

మాచర్ల పాఠశాలలో 76 మంది, యూ పీఎస్ సి లో 73 మంది విద్యార్థులు ఉన్నారని, కొంతమేరకు రిపేర్లు ఉన్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు.

కొల్లాపురం పాఠశాలలో1 నుండి 7 వ తరగతి వరకు 181 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని, కొన్ని అదనపు గదులు, రిపేర్లు కూడా ఉన్నట్లు తెలిపారు

పొనుగోడు హరితహారం నర్సరీని తనిఖీ చేసి మొక్కలను పరిశీలించి, ఎన్ని ఇండ్లు ఉన్నాయని నర్సరీ లో ఎన్ని మొక్కలు పెంచుతున్నారని పంచాయతీ కార్యదర్శి వన సేవక్ అడిగారు 17 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, 7వేల కన్వర్షన్ చేసినట్లు,8 వేల గ్రీన్ ప్లాంట్, 3 వేల హోమ్ నీడ్స్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలుపగా హరిత హారంలో నాటుటకు మీటర్ ఎత్తు ఉన్న మొక్కలు మాత్రమే నాటాలని, 500 గృహాలకు అవెన్యూ ప్లాంటేషన్ కు ఏ ఒక్క ముక్క కూడా తక్కువ కాకూడదని, 10,000 ప్లాంటింగ్ కు అందుబాటులో మొక్కలు ఉండాలని బ్యాగులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని కన్వర్షన్ ఎందుకు చేయలేదని స్టాక్ ఎందుకు తక్కువగా ఉందని, రోజుల తర్వాత పేమెంట్ అవుతుందా లేదా అని మస్టర్ రికార్డ్ చేయాలని స్లిప్పులు ఇవ్వాలని, వైకుంఠధామం, సెగ్రీ యేషన్ షెడ్ లల్లో ఎలక్ట్రిసిటీ అమర్చ పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కరెంటు సౌకర్యం కల్పించి వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకు రావాలని ఆదేశించారు. బోర్ వెల్స్ తప్పనిసరిగా వేయించి నీటి సౌకర్యం కల్పించాలని, 300 మీటర్ల లోపు గ్రామానికి దగ్గరలో ఉంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ద్వారా నీటిని అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి డి దిలీప్ కుమార్, పి ఆర్ ఈ ఈ సురేష్ తాసిల్దార్ అశోక్ కుమార్ ఎంపీడీవో విజయలక్ష్మి, హెచ్ ఎం లు, సుహాన్ దుబి, సూర్య నారాయణ, పి ఆర్ డీ ఈ రాజలింగం సర్పంచ్ లు మణి చెందిన, వెంకన్న,సుధాకర్ రావు, ఎం పి టి సి లు రజిత సోము, ప్రసన్న కుమారి పంచాయతీ కార్యదర్శి విజయ, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.


Share This Post