వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా “ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ” : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మి న్ భాష

పత్రికా ప్రకటన.    తేది:09.08.2022, వనపర్తి.
 
     స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
     మంగళవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “స్వతంత్ర భారత వజ్రోత్సవ”  కార్యక్రమంలో భాగంగా “ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో కలిసి మంత్రి ప్రారంభించారు.
     ఈ సందర్భంగా 450 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఇంటింటా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన గుర్తు చేశారు. పాఠశాల విద్యార్థులకు గాంధీ సినిమా ప్రదర్శన చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అధికారులకు గాంధీ సినిమా ప్రదర్శనను తిలకించేలా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఆయన సూచించారు. ఈ నెల 13, 14, 15వ. తేదీలలో దేశభక్తితో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా జెండా పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు, గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీలు, మునిసిపాలిటీలలో వార్డ్ సభ్యులు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జెండా పంపిణీ సమయంలో నియమ, నిబంధనలు పాటించాలని, బృందాల వారీగా ఇంటింటికి తిరిగి జెండాలను, పివిసి పైపులు అందజేస్తారని, ఇచ్చిన జెండాలను ఎగురవేసే సమయంలో నిబంధనలు పాటించాలని పారవేయడం చేయరాదని, నిబంధనలు పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
      ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష మాట్లాడుతూ రోజువారి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె సూచించారు. 10వ తేదీన వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆమె తెలిపారు. 11వ తేదీన ఫ్రీడం రన్ నిర్వహిస్తున్నట్లు, 12వ తేదీన కేబుల్ ఛానల్స్ లలో దేశభక్తికి సంబంధించిన ప్రసారాలు నిర్వహించాలని, 13వ తేదీన వజ్రోత్సవ ర్యాలీనీ విద్యార్థులు, యువకులు, వివిధ సామాజిక వర్గాలతో నిర్వహిస్తున్నట్లు, 14వ తేదీన జానపద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె సూచించారు.
– ఆగస్టు 08: ప్రారంభ కార్యక్రమం.
– ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం.
– ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామాల్లో మొక్కలు  నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు.
– ఆగస్టు 11: ఫ్రీడం రన్‌ నిర్వహణ.
– ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి.
– ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు..
– ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు.
– ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ.
– ఆగస్టు 16: ‘ఏకకాలంలో, ఎక్కడివారక్కడ  ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.- ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ.
– ఆగస్టు 18: ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ.
– ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ.
– ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు.
– ఆగష్టు 21: ప్రత్యేక గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ మీటింగులు నిర్వహించాలి.
– ఆగష్టు 22: రాష్ట్ర రాజధానిలో నిర్వహించే కార్యక్రమంతో వజ్రోత్సవ వేడుకలు ముగింపు కార్యక్రమాలు.
      రోజు వారీ షెడ్యూల్ ప్రకారం  కార్యక్రమాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
      అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి త్రివర్ణ పతాకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
     ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, ఎస్పి రంజన్ రతన్ కుమార్, ఏ ఎస్పి షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, సాయి చంద్ గిడ్డంగుల చైర్మన్ కురుమూర్తి యాదవ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.
 

Share This Post