వజ్రోత్సవ వేడుకలు వైభవోపేతంగా దిగ్విజయం చేయాలి

వజ్రోత్సవ వేడుకలు వైభవోపేతంగా దిగ్విజయం చేయాలి

 గాల్లోకి వదిలిన త్రివర్ణ రంగుల బెలూన్

వందేమాతరం, భారత్ మాతాకీ జై  నినాదాలతో మార్మోగిన ఫ్రీడమ్ ర్యాలీ

అంబేద్కర్ స్టేడియం నుండి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ- పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్,  స్కౌట్స్ అండ్ గైడ్స్, వివిధ క్రీడల అసోసియేషన్లు

నగర మేయర్ వై సునీల్ రావు

000000

       జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను  వైభవోపేతంగా దిగ్విజయం చేయాలని కరీంనగర్ నగర మేయర్ వై సునీల్ రావు అన్నారు.

     శనివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ స్టేడియం నుండి టవర్ సర్కిల్ వరకు విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ , స్కౌట్స్ అండ్ గైడ్స్ తో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ ని  పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఫ్రీడమ్ ర్యాలీ వందేమాతరం, భారత్ మాతాకీ జై, సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే నినాదాలతో మార్మోగింది.  క్లాక్ టవర్ వద్ద ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలు వైభవోపేతంగా దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 8 నుండి ఈరోజు వరకు నిర్వహించిన ఉత్సవాలను దిగ్విజయం చేసినందులకు ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకల సంబరాలను విజయవంతం చేయాలన్నారు.

     పోలీస్ కమిషనర్ ఈ సత్యనారాయణ మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వతంత్రాన్ని వైభవోపేతంగా నిర్వహించుకోవాలి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో  భాగంగా ఈనెల 16న ఏకకాలంలో నిర్వహించు జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

     ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పోరేటర్లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి, స్కోట్స్ అండ్ గైడ్స్, క్రీడా కారులు, తెలంగాణ సంస్కృతి సారధి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post