వట్టేమ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటుకు మౌళిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు

వట్టేమ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటుకు మౌళిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  సోమవారం  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వట్టేమ్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పునరావాస కేంద్రములో ఏర్పాటు చేస్తున్న రోడ్లు, డ్రైనేజ్, మంచి నీటి ఏర్పాతుకు జరుగుతున్న పనులను పరిశీలించారు.   ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసి నిర్వాసితులకు నివాస యోగ్యం కల్పించే విధంగా ముమ్మర చర్యలు చేపట్టాలన్నారు. 520 కుటుంబాల ఆవాసానికి సరిపడా డ్రైనేజి సిస్టం, రోడ్లు, విద్యుత్తు, తాగు నీరుతో పాటు పాఠశాలలు, పి.హెచ్.సి,  తదితర మౌళిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఈ.ఈ టి.ఎస్.డబ్ల్యూ. ఐ.డి.సి రామచంద్రా, ఈ.ఈ ఇరిగేషన్ పార్థసారథి, డి.ఈ. వరప్రసాద్,  హెచ్.ఈ.ఎస్. కంపెనీ    ఏ.జి.యం. రామన్, డి.ఈ.ప్రతాప్, ఆర్.డి.ఓ రాజేష్, తహసిల్దార్ అంజిరెడ్డి తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

Share This Post