వడదెబ్బల జాగ్రత్త ల పై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వడ దెబ్బ జాగ్రత్తల పై రూపొందించిన పాటల సీడీనీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి

——————————

జిల్లా కేంద్రం సిరిసిల్ల లోని
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తన ఛాంబర్ లో వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రూపొందించిన పాటల సీడీనీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి శనివారం ఆవిష్కరించారు.

ఎండ కాలంలో ప్రజల వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల ను సూచిస్తూ
సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్త ఆధ్వర్యంలో DPRO మామిండ్ల దశరథO పర్యవేక్షణలో
” భగ భగ ఎండలకు జరభద్రo” అనే పేరుతో ఈ పాటల సిడి ని రూపొందించారు.

వడదెబ్బ జాగ్రత్తల పై రూపొందించిన పాటలను తెలంగాణ సాంస్కృతిక సారథి గడ్డం శ్రీనివాస్ రచించగా తెలంగాణ సాంస్కృతిక సారథి గణేష్ పాడారు. TSS ఆర్టిస్ట్ కాయతోజు ప్రవీణ్ సంగీతాన్ని సమకూర్చారు.
జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథo స్వయంగా పాడారు.

ప్రజల వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలను చైతన్యం చేసేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రత్యేక పాటల సిడి రూపొందించడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ తెలిపారు. పాట పాడిన dpro దశరథo ను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ సత్య ప్రసాద్, DPRO మామిoడ్ల దశరథo , తెలంగాణ సాంస్కృతిక సారథులు కాయితోజుప్రవీణ్, గడ్డం శ్రీనివాస్, దొబ్బల ప్రకాష్
లు పాల్గొన్నారు.

Share This Post