వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ యందు క్రిస్మస్ పండుగ సందర్భంగా ” క్రిస్మస్ విందు”లో పాల్గొన్నజిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన.     తేది:23.12.2021, వనపర్తి.

అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో పండగ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆకాంక్షించారు.
గురువారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ యందు ” క్రిస్మస్ విందు” కు జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్ లు, దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను కరోనా నిబంధనలు పాటిస్తూ, సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. క్రిస్టియన్ల అభివృద్ధి కొరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లందరికీ జిల్లా అదనపు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన క్రిస్మస్ విందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి పి.అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, చర్చ్ పాస్టర్ లు కృష్ణ పాల్, బిపి ఎర్నెస్ట్. పి డి జయ ఆనందం, ఎం ఎస్ రోనాల్డ్. విజయ్ కుమార్, కావ్య కుమార్, మనోహర్, సుకన్య, పాస్టర్ మరియప్ప, శ్రీకాంత్, జనార్ధన్, క్రైస్తవ మత పెద్దలు, సిబ్బంది, క్రిస్టియన్లు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post