వనపర్తిలోని నర్సింగ్ కళాశాల నిర్మాణ పనుల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష 

పత్రికా ప్రకటన.        తేది:16.11.2021, వనపర్తి.

ప్రభుత్వం మంజూరు చేసిన నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
మంగళవారం వనపర్తిలోని నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సింగ్ కళాశాల పనులపై ఎలాంటి జాప్యం లేకుండా, సకాలంలో పనులను పూర్తిచేయాలని, వాటికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ లను ఆదేశించారు. ప్రతి రోజు పనుల పురోగతిపై ప్రగతి నివేదిక అందించాలని ఆమె సూచించారు. త్వరలో జిల్లాకు కేంద్ర బృందం రానున్న నేపథ్యంలో అధికారులు శ్రద్ధ వహించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, సీ.సీ. కెమెరాలు ఏర్పాటుతో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, రాత్రి సమయం వెచ్చించి సిబ్బందితో పనులను సత్వరమే పూర్తి చేయాలని, సిబ్బంది సామర్థ్యం పెంచాలని ఆమె తెలిపారు. ఎలక్ట్రిసిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యుత్ ఈ.ఈ. ని ఆదేశించారు.
అనంతరం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ఆమె పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీఎంహెచ్వో చందు నాయక్, ఆర్ అండ్ బి ఈ.ఈ. దేశ్య నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ రాజేందర్ గౌడ్, విద్యుత్ శాఖ ఈ.ఈ. నరేందర్ కుమార్, కాంట్రాక్టర్  రామారావు, దానయ్య, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post