వనపర్తిలోని స్కాలర్స్, సివి రామన్, ప్రభుత్వ బాలుర కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,       తేది:25 .10 .2021, వనపర్తి.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ వనపర్తిలోని స్కాలర్స్, జూనియర్ కళాశాల, సివి రామన్ జూనియర్ కళాశాల,  ప్రభుత్వ బాలుర కళాశాలతో సహా వివిధ పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, రవాణా, వైద్యం, తదితర సౌకర్యాలను ఆమె సమీక్షించారు.
జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయని, ఈ నెల 25వ. తేది నుండి నవంబర్ 2 వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె సూచించారు. వనపర్తి జిల్లాలో మొత్తం ఇంటర్మీడియట్ విద్యార్థులు (7034) మంది పరీక్షలు వ్రాయవలసి ఉండగా, (6381) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని, (653) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారనీ ఆమె వివరించారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు 90.72 శాతం నమోదైనట్లు ఆమె తెలిపారు.
కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల వద్ద  ఉదయం, సాయంత్రం శానిటైజ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్ష కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్ష కేంద్రాలకు రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, మునిసిపాలిటీ తదితర శాఖల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
…………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి  ద్వారా జారీ చేయడమైనది.

Share This Post