వనపర్తి గోదాముకు బతుకమ్మ చీరలు, పంపిణీకి సిద్దం : జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్

పత్రికా ప్రకటన తేది:24.09.2021.
వనపర్తి.
మన రాష్ట్రంలో బతుకమ్మ పండగ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్ తెలిపారు.
శుక్రవారం ప్రెస్ మీట్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 6 నుండి బతుకమ్మ ఉత్స వాలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఆయన సూచించారు. వనపర్తి జిల్లా కు 2 లక్షల 2 వేల 682 చీరలు లక్ష్యం ఉండగా, వనపర్తి గోదాముకు 1 లక్ష 54 వేల చీరలు చేరాయని ఆయన తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో బతుకమ్మ చీరలు జిల్లాకు చేరతాయని ఆయన స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాగానే పంపిణీ చేయడం జరుగుతుందని, అక్టోబర్ 2, 3 తేదీల్లోగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం పూర్తవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వివరించారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post