వనపర్తి జిల్లా 5వ. వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా

పత్రికా ప్రకటన తేది:11.10.2021, వనపర్తి.

వనపర్తి జిల్లా 5వ. వార్షికోత్సవం సందర్భంగా పనులు నిర్వర్తించుటకు, జిల్లాలోని సమస్యలు పరిష్కరించుటకు సౌలభ్యంగా ఉందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి సహకారంతో, జిల్లా అధికారుల సహాయ, సహకారాలతో జిల్లా అభివృద్ధి చెందుతున్నదని ఆమె తెలిపారు. రాష్ట్రంలోనే మన జిల్లా ముందంజలో ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. జిల్లాలు ఏర్పడటంతో పనులలో జాప్యం లేకుండా త్వరగా పరిష్కారం అవుతున్నాయని, లబ్ధిదారులకు సత్వర న్యాయం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్, డి.ఎం.& హెచ్.వో. చందు నాయక్, డి.ఆర్.డి.ఓ. నరసింహులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post