వనపర్తి పరిధిలోని లే అవుట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన     తేది:01.12.2022, వనపర్తి.

లే అవుట్ ల నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
గురువారం వనపర్తి పట్టణ పరిధిలోని లే అవుట్లను ఆయన పరిశీలించారు. లే అవుట్ల అనుమతుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. లే అవుట్ ల ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన తెలిపారు. అక్రమ లే అవుట్లపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లే అవుట్ కమిటీ సభ్యులు, ఆర్ అండ్ బి ఈ. ఈ. దేశ్య నాయక్, ఇరిగేషన్ ఈ.ఈ,  విద్యుత్ శాఖ ఈ.ఈ.లు, తాసిల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, టి.పి.ఎస్. తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణకు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు హరిజనవాడ పరిధిలోని జడ్పీ హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న “గరుడ పుష్కరిణీ” బావి పునరుద్ధరించాలని ఆయన సూచించారు. ఎన్జీవో, గ్రీన్ టీమ్ సహకారంతో వెంటనే అందుబాటులోకి తేవాలని  మున్సిపల్ కమిషనర్ ను సిబ్బందికి ఆయన ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, డి. ఈ, ఏ ఈ. తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post