వనపర్తి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రిక ప్రకటన
తేది 26-5-2023
వనపర్తి జిల్లా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలకు స్వయం పాలన కొరకు గ్రామపంచాయతీ లు మార్చడమే కాకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మండలములో పర్యటించి 3.34 కోట్ల రూపాయల అభివృద్ధి మనులకు శంఖుస్థాపన లు చేశారు. తూర్పు తాండా లో రు. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి శంఖుస్థాపన చేశారు. చిట్యాల నుండి పడమటి తాండా వరకు రు. 43 లక్షల వ్యయంతో బి.టి రోడ్డుకు శంఖుస్థాపన చేశారు. అనంతరం అచ్యుతాపూర్ నుండి చిట్యాల వరకు రు. 1.70 కోట్ల వ్యయంతో వేయనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అచ్యుతాపూర్లో మైసమ్మ గుడి పెద్దమ్మ గుడి లో మంత్రి దర్శనం చేసుకోగా పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆర్ అండ్ బి రోడ్ నుండి పాపాగని తాండ కు రూపాయలు 54 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. చందాపూర్ పంచాయతీ రాజ్ రోడ్డు నుండి పెడ్డతాండ వరకు రు. 47 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న బి.టి. రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకు తాండాలు, గూడెం లను గ్రామపంచాయతీ లుగా మార్చడం జరిగిందని తద్వారా తమ ఊరి అభివృద్ధి తామే చేసుకునే విధంగా పరిపాలన సౌలభ్యం కల్పించిందని తెలియజేశారు. తాండాలు, గూడెం లలో అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యుత్తు, రోడ్లు, పాఠశాలలు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తదితర అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తుందని తెలియజేశారు.
ఈ. ఈ. పంచాయతీ రాజ్ మల్లయ్య, మండల అభివృద్ధి అధికారి, సుదర్శన్, ఆయా గ్రామ పంచాయతీ ల సర్పంచులు ఎన్. లక్ష్మణ్ , ఫుల్సింగ్ నాయక్, బి. శారద, రుప్లి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మంత్రి వెంట పాల్గొన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి ద్వారా జారీ.

Share This Post