వనపర్తి మున్సిపల్ పరిధిలోని పలు వ్యాక్సినేషన్ సెంటర్ల తనిఖి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా

పత్రిక ప్రకటన.    తేది:11.12.2021, వనపర్తి.

ప్రతి ఒక్కరు కరోన వ్యాక్సిన్ 2 డోసులు తప్పక వేయించుకోవాలని, జిల్లాలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు.
శనివారం జిల్లాలోని పలు వ్యాక్సినేషన్ సెంటర్లను  జిల్లా కలెక్టర్ తనిఖి చేశారు. వనపర్తి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు, మారెమ్మ కుంట, బ్రహ్మంగారి వీధిలోని సెంటర్లను సందర్శించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు 2 డోసులు వ్యాక్సిన్ తీసుకునేలా, తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఇచ్చిన టార్గెట్ ను పూర్తిచేయాలని ఆమె తెలిపారు. ప్రతి వార్డులో, గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు శ్రద్ద వహిస్తున్నారని, ఇంకా మిగిలి పోయిన వారికి వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
ఆదివారం ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, స్పెషల్ అధికారులు, మొబైల్ టీం లతో ప్రతి షాపు, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో, కూరగాయల మార్కెట్ పరిధిలోని వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో శనివారం 4 వేల వ్యాక్సినేషన్ లక్ష్యం ఉండగా ఇప్పటివరకు దాదాపుగా లక్ష్యం పూర్తయిందని ఆమె తెలిపారు. శనివారం రెండవ డోసు కు జిల్లాలో 15 వేల మంది అర్హులుగా ఉన్నారని, అదేవిధంగా మొత్తం 1 లక్ష 40 వేల లక్ష్యం ఉండగా, డిసెంబర్ 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయాలని, ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించి, అవగాహన కల్పించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా వైద్య సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో మొదటి, రెండవ డోసు లు పూర్తి చేసి, 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబందాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post