వనపర్తి మున్సిపాలిటీలోని నల్లచెరువు, ట్యాంక్ బండ్, ఇరిగేషన్ ఈ.ఈ. లేఅవుట్ల పనుల తనిఖీ : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.     తేది:16.11.2021,  వనపర్తి.

లే అవుట్లను క్రమబద్ధీకరించాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
మంగళవారం వనపర్తి మున్సిపాలిటీలోని నల్లచెరువు, ట్యాంక్ బండ్, ఇరిగేషన్ ఈ ఈ లేఅవుట్లను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో లేఅవుట్లు క్రమబద్ధీకరించడానికి కమిటీ పర్యవేక్షణ జరిపి, క్రమబద్ధీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. నల్ల చెరువు, ట్యాంక్ బండ్, నీటిపారుదల శాఖ పనులు, సుందరీకరణ పనులు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పనులు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ (రెవిన్యూ),  పంచాయతీ రాజ్ (పి.ఆర్) ఈ.ఈ, ఆర్ అండ్ బి ఈ. ఈ, నీటిపారుదల శాఖ ఈ.ఈ, విద్యుత్  శాఖ ఎస్.ఈ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post