వనపర్తి మున్సిపాలిటీలోని పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.   తేది:7.12.2021, వనపర్తి.

పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
మంగళవారం వనపర్తి మున్సిపాలిటీలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘం పల్లె ప్రకృతి వనంలో చేపట్టిన పనులు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. పల్లె ప్రకృతి వనంలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు వేరు చేయటం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం, పొడవైన మొక్కల మార్పిడిని పూర్తిచేయటం వంటి పనులు పట్టాలని ఆయన తెలిపారు. పదిహేను రోజుల లోపు పనులు పూర్తిచేసి, రోజువారి రిపోర్టులను తయారుచేసి అందించాలని ఆయన సూచించారు. నర్సరీ పనులు పూర్తిచేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, నర్సరీని ఆకర్షణీయంగా తయారు చేయాలని ఆయన వివరించారు. నర్సరీ పనులు పూర్తి చేయుటకు ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post