వనపర్తి మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రస్థాయి అత్యున్నత వైద్య బృందం పరిశీలన, సమావేశం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
9 9 2021
వనపర్తి

వనపర్తి మెడికల్ కళాశాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ చాంబర్లో రాష్ట్రస్థాయి అత్యున్నత వైద్య బృందం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో అన్ని సౌకర్యాలతో రెండు నెలల లోపు కళాశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ తెలిపారు.
మెడికల్ కళాశాలకు అవసరమైన రోడ్లు, ల్యాబ్ సౌకర్యాలు, హాస్టల్, మెడికల్ కళాశాల క్లాస్ రూమ్ లు, భవనం కు సంబంధించిన అంశాలను రూట్ మ్యాప్ ద్వారా రాష్ట్ర వైద్య బృందం జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ , డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి , టీఎస్ ఎంఐ డీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్నగర్ మెడికల్ కళాశాల డాక్టర్ పుట్టా శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, ఈ ఈ. ఎం ఐ డి. జైపాల్ రెడ్డి, ఏడి రాఘవన్, ఏ ఈ శివ, వనపర్తి డి ఎం & హెచ్ వో చందు నాయక్, హెల్త్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నల్ల చెరువు సమీపంలో కలెక్టర్ తో కలిసి వైద్య బృందం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని గురువారం సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ , డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి , టీఎస్ ఎంఐ డీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి మెడికల్ కళాశాల రావడం అదృష్టమని అన్నారు. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి అత్యున్నత వైద్య బృందం మెడికల్ కళాశాల స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు వైద్యులు, సిబ్బంది ,నర్సింగ్ కళాశాల, ఫ్యాకల్టీ క్వార్టర్స్, పార్కింగ్, తదితర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టేందుకు వైద్య బృందం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post