పత్రికా ప్రకటన. తేది:8.12.2021, వనపర్తి.
ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతున్నట్లు, రైతులు నష్టపోకుండా అన్ని విధాలుగా తోడ్పాటును అందించాలని వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు.
బుధవారం వనపర్తి మెప్మా, అన్నారం, గోప్లాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను 17 శాతం లోపు తేమ ఉన్న వరి ధాన్యాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. జిల్లాలో 230 ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంట డి ఆర్ డి ఓ, ఐకెపి సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.