వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అదనపు కలెక్టర్ – ప్రతిమ సింగ్

వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అదనపు కలెక్టర్ – ప్రతిమ సింగ్

వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వాటిని సంరక్షించ వలసిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. జాతీయ వన్య ప్రాణుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి మాట్లాడుతూ జనాభా పెరుగుదల, అవసరాల మేరకు నగరాల విస్తీర్ణ వల్ల అడవులు శాతం తగ్గిపోయి అడవులలో స్వేచ్ఛగా జీవించవలసిన వన్య ప్రాణుల మనుగడకె ముప్పు ఏర్పడిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలక పాత్ర వహిస్తాయని, కానీ నేడు అడవులు కుంచించుకుపోవడం వల్ల పర్యావరణ సమతుల్యాన్ని విఘాతం కలుగుతుందని అన్నారు. కాబట్టి అడవుల ఆవశ్యకత, వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకత, సంరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించాలని అన్ని దేశాలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని అన్నారు. మన జిల్లాలో నరసాపూర్, పోచారం, చేగుంటలో ఉన్న అడవులను కాపాడడం తో పాటు వాటిలో ఉండే చిన్న చిన్న జంతువులను సంరక్షించుటకు అటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇతోధికంగా పాటు పడుతున్నాయ ని, చట్టాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నదని అన్నారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుటకు ఒక సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. ప్రజలు తమ దైనందిన కార్యక్రమాల మాదిరే హరితహారంలో మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు అటవీ నుండి రోడ్డు పైకి వస్తున్న వన్యప్రాణువులను సంరక్షించాలని కోరారు.
అనంతరం వన్యప్రాణుల సంరక్షణ పై జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన 13 మంది విజేతలకు ప్రశంసా పత్రం, జామెంట్రీ బాక్స్ ను అదనపు కలెక్టర్లు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్, డి.ఈ.ఓ. రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, సెక్టోరల్ అధికారి సుభాష్, మెదక్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మనోజ్ కుమార్, బీట్ అధికారి కిష్టయ్య, నరేందర్ పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post