వయోవృద్దులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, వయోవృద్ధుల కోసం ప్రత్యేక హక్కులు మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్……

పత్రిక ప్రకటన

తేదీ : 28–10–2022

వయోవృద్దులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి,
వయోవృద్ధుల కోసం ప్రత్యేక హక్కులు, చట్టాలను ప్రభుత్వం కల్పించింది,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,
తల్లిదండ్రులు, వయోవృద్ధులను భారంగా భావించకుండా వారికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వారి వల్లే ప్రస్తుతం అందరూ ఉన్నతస్థితిలో ఉంటూ మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు వయా వృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ,ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు దైవసమానులని వారిని అందరూ ప్రేమాభిమానాలు, గౌరవభావంతో చూడటంతో పాటు వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ విషయంలో వయోవృద్ధుల కోసం ప్రభుత్వం హక్కులు, చట్టాలను రూపొందించిందని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో వృద్ధాశ్రమాలు లేకపోవడం వృద్ధులైన తల్లిదండ్రులను వాటిలో అప్పగించడం వంటివి ఉండేవి కావని ప్రస్తుతం అందరూ అనేక కారణాలతో కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలివేయడం ఒకింత బాధాకరంగా ఉందన్నారు. అలాగే నేటితరం పిల్లలకు స్కూల్స్, కాలేజీల్లో కుటుంబం విలువలు, కుటుంబం పట్ల అవగాహన, తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ, వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలని ఆయా శాఖల అధికారులకు వివరించారు. ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం, వారి పోషణ, సంరక్షణతో పాటు జీవించే హక్కు , ఆస్తి హక్కు వంటి ఎన్నో హక్కులను, తల్లితండ్రుల మరియు వయావృద్ధుల పోషణ చట్టం, 2007 చట్టంలో కల్పించిందని తమ హక్కులకు భంగం కలిగితే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయడం జాతీయ హెల్ప్ లైన్ 14567 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయవచ్చని రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ స్పష్టం చేశారు. దీంతో పాటు వృద్దులు 90 ఏళ్ల పైబడి జీవిస్తున్నారంటే వారిలో ఉన్న మానసిక ధైర్యం, దృఢత్వం గుర్తించాలని, వారిపట్ల ప్రేమ, దయ, మమకారం చూపుతూ వారి అనుభవాలను తెలుసుకొని ముందుతరాలకు దిక్సూచిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అనంతరం వయోవృద్ధులను శాలువాలలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి అకేశ్వర రావు ,పావని, కుషాయిగూడ ఎసిపి రష్మి పెరమాల్, ఏసీపి రామలింగరాజు, , జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి,ఆర్డీవోలు రవి, మల్లయ్య,FRO, సనత్ కుమార్,శరత్ కుమార్, సీనియర్ సిటిజన్ కమిటీ మెంబర్ నాగేశ్వర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు , వయోవృద్దులు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post