వయోవృద్దులు నేటి తరానికి మార్గనిర్దేశకులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0 0 0 0

    జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుచూసిన సీనియర్ సిటిజన్లు (వయోవృద్దులు) నేటి తరానికి మార్గనిర్దేశకులని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

 మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్యఅతిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం వృద్ద తల్లిదండ్రులను సంరక్షించనట్లయితే ఆ పిల్లలు చట్టరీత్యా చర్యకు బాధ్యులవుతారని అన్నారు. కార్యక్రమంలో ముందుగా హెల్ప్ ఎజ్ ఇండియా వారిచే తల్లితండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 గురించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వయావృద్దుల సంరక్షణ చట్టంలో సూచించిన కొత్త విషయాలను గురించి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ చట్టంపై అందరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వయోవృద్దులలో కేవలం 20శాతం మాత్రమే వారి ఆర్థిక అవసరాలను తీర్చుకునే స్థాయిలో ఉన్నారని మిగిలిన వారు అనధలుగా, నిరాదరణకు గురవుతున్నారని వారిని సంరక్షించడం అందరి బాద్యతగా గుర్తేరగాలని పేర్కోన్నారు. ఇందుకోసం 1456 అనే టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ నెంబరు ద్వారా సమస్యలను ఎదుర్కోనే వృద్దుల వివరాలను ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని పేర్కోన్నారు. రాష్ట్రంలో కరీంనగర్, హైదరాబాద్ లలో మాత్రమే ప్రభుత్వ ఒల్డ్ ఎజ్ హోం లు ఉన్నాయని, కరీంనగర్ లో 3 ప్రైవేటు వృద్దాశ్రమాలు ఉన్నాయని, 1 ప్రభుత్వ ఆశ్రమం నిర్వహించబడు తుందని పేర్కోన్నారు. 2025 వరకు ప్రతి జిల్లాకు రెడ్ క్రాస్ సోసైటి, ప్రభుత్వం సమిష్టింగా ప్రతిజిల్లాకు ఒక ఓల్డ్ ఎజ్ హోంలను ఏర్పాటు చేయనున్నారని పేర్కోన్నారు. ప్రస్తుత గృహాలలో నిత్యం మెడికల్ క్యాంపులను నిర్వహించాలని, జిల్లాలో వృద్దుల సంఖ్య అధికంగా ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, మరి ముఖ్యంగా జిల్లా ప్రదాన ఆసుపత్రిలో ఖచ్చితంగా వయోవృద్దుల కొరకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని, పించను కోసం బ్యాంకులకు వెళ్లే వృద్దులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుకు ఆదేశించడం జరుగుతుందని పేర్కోన్నారు. జిల్లాలో నూతనంగా బస్తి దవాఖానాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, వాటిని మరింత పెంచుకోవడం జరుగుతుందని, వాటిద్వారా కూడా వృద్దులకు మరింత ఎక్కువ వైద్య సేవలను అందించగలుగుతామని పేర్కోన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో వృద్దుల కొసం ప్రత్యేకంగా ఒక రిజీష్టరును ఏర్పాటు చేయాలని, వృద్దుల డే కేర్ సెంటర్ కొరకు జిల్లాలో అందుబాటులో ఉన్న భవనాన్ని గుర్తించి ప్రతిపాదించినట్లయితే దానిని అభివృద్ది చేసి చెస్, క్యారం వంటి ఇండోర్ గేమ్స్ తో పాటు పుస్తకాలను అందిస్తానని పేర్కోన్నారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జువేరియా, ఎల్డర్ లైన్ స్టేట్ కోఆర్డినేటర్ రజాక్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహసిల్దార్ సుధాకర్, లీగల్ అడ్వైజరి ఐలయ్య, సీఐ వెంకట నరసయ్య, వయోవృద్ధుల సంఘాల బాధ్యులు సముద్రాల జనార్దన్ రావు, పెండ్యాల కిషన్ రావు పాల్గొన్నారు.

Share This Post