వయోవృద్ధులైన క్యాన్సర్ రోగులకు వైద్యం తో పాటు మనోధైర్యాన్ని ఇస్తూ వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్యులు పర్యవేక్షించాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్-07:

వయోవృద్ధులైన క్యాన్సర్ రోగులకు వైద్యం తో పాటు మనోధైర్యాన్ని ఇస్తూ వారికి ఎలాంటి సమస్యలు లు తలెత్తకుండా వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో క్యాన్సర్ రోగుల సoరక్షణ పై కల్పించవల్సిన వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందించవల్సిన వైద్యసేవలపై, కావాల్సిన మందులు, పరికరాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి , వారి ఇండ్ల కు పాలియేటివ్ కేర్ జిల్లా టీం వారు వెళ్లి వారి పరిస్థితులను కనుక్కుని వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, తీసుకుంటున్న ఆహారo న్యూట్రిషన్ తో కల్గివుండేలా చూడాలని, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇంటి వద్ద సరైన వసతులు లేని, సేవలు అందని క్యాన్సర్ పేషేంట్స్ కు జిల్లా లో త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోనే ఫ్రీ బెడ్స్, వసతులు, సేవలు కల్పించనున్నట్లు దాని కోసం సుమారు 10 పడకల పాలియేటివ్ కేర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ రోగులను గుర్తించుటకు గాను మొదటి విడతగా బయ్యారం, కంబాలపల్లి, కురవి 3 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వే చేస్తున్నట్లు, దానికోసం 1 డాక్టర్, 1 ఫిజియోతెరపి, ముగ్గురు నర్సులు ఐదుగురితో ఒక పాలియేటివ్ కేర్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏరియా ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందరికి అందెట్లు చూడాలని, నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ 1-డోస్ 36 %, 2వ డోస్ 12% తో వ్యాక్సిన్ కొనసాగుతుందని, జనవరి 2021 నుండి గత నెల జులై వరకు జిల్లా వ్యాప్తంగా నార్మల్ డెలివరీ ల శాతం పెరిగిందని, వైద్య శాఖ లో ఖాళీగా ఉన్నా పోస్టులు భర్తీ చేయాలని, ఇప్పుడే పుట్టిన పిల్లలకు బ్రీతింగ్ సమస్య లు ఏర్పడుతున్నందున వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని డాక్టర్లు కలెక్టర్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి హరీష్ రాజ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకట్రాములు, ఆర్.ఎం.ఓ. Dr. రమేష్, వివిధ ప్రత్యేక నిపుణుల డాక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post