వయోవృద్ధుల చట్టాలను అమలు పరచటానికి తగు చర్యలు తీసుకొంటాం : జిల్లా కలెక్టర్ బి.గోపి

వయోవృద్ధుల చట్టాలను అమలు పరచటానికి తగు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 31వ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు .

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని అందరం కలిసి జరుపుకోవడం ఆనందదాయకం మని మొదట నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

తల్లిదండ్రుల అభిప్రాయాలు వారి కష్టాలను అడిగి తెలుసుకోవాలని పెద్దలు తమ కష్టాలను ఎవరికి చెప్పరని, కావున సహృదయంతో కుటుంబ సభ్యులే అడిగి తెలుసుకొని, వారికి అన్నీ సమకూర్చాలని అది తమ బాధ్యతగా భావించాలని కలెక్టర్ తెలిపారు.

వయోవృద్ధుల కు అమలులో ఉన్న చట్టాలను సకాలంలో అమలు పరిచేందుకు తగు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు.

పోలీస్ స్టేషన్ లో కూడా కమిటీ ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రతి సమస్యను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తేవాలని వాటికి నేను తప్పక పరిష్కార మార్గాలను చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది .

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్ మరియు రాష్ట్రనాయకులు పలు సంఘాలు మాట్లాడారు.

అనంతరం కొంతమంది సేవా తత్పరులు, అధికారులకు పెద్దలకు ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ల కేంద్ర సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణ రెడ్డి, న్యాయవాది వేముల గౌరీశంకర్ ,డి డబ్ల్యూ ఓలు కవిత ,మాచర్ల శారద, dmhoవెంకటరమణ ,రచయిత లు చంద్రమౌళి, డాక్టర్ టి.వి సుజాత కుమారి , అనుసూరి చంద్రమౌళి దామెర నరసయ్య , పి. నాగమణి ,V.నాగేశ్వరరావు మరియు జిల్లాలోని వయోవృద్ధులు పలు సంఘ నాయకులు పాల్గొన్నారు.


Share This Post