ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులను చూసుకునే బాధ్యత వారి సంతానానివే అని తెలిపారు, నిరాధారణకు గురైన వయోవృద్ధులు వారి సమస్యల పట్ల వివరాల పట్ల వయోవృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567 కాల్ చేసి చెప్పవచ్చని తెలిపార. అనాధ వయోవృద్ధుల కోసం జిల్లాలో వృద్ధుల ఆశ్రమం ప్రారంభించినట్లు తెలిపారు, వయోవృద్ధుల పట్ల ప్రేమానురాగాలతో చూసుకోవాలని తెలిపారు వృద్ధులను వేధింపులకు గురి చేస్తే తల్లిదండ్రుల వయోవృద్ధుల మరియు సంక్షేమ చట్టం 2007 చట్టం ద్వారా కఠినంగా శిక్ష పడుతుంది అని చెప్పారు. అదేవిధంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ వయవృద్ధుల కోసం ప్రత్యేక క్షేత్రస్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యల పట్ల తెలుసుకుంటామని తెలిపారు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ భాగంగా వృద్ధులకు ఆట పోటీలు జరిపి కలెక్టర్ చేతుల మీదగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందనగారు, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు గారు, సీనియర్ సిటిజన్ కమిటీ మెంబర్ Athram garu, సిడిపిఓ వెంకటమ్మ గారు, క్షేత్రస్థాయి అధికారి సాయి మరియు వయోవృద్ధులు అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది.