వయో వృద్దులకు ప్రత్యెక చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు.

వయో వృద్దులకు ప్రత్యెక చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని  సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు.

ఆదివారం  జిల్లా కేంద్రం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్ననే ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని కానీ వాళ్ల కొరకు ప్రత్యేక చట్టాలు ఉన్న విషయం చాలా మందికి తెలియక అనాధాలుగా ఉండిపోతున్నారన్నారు.  నేటి సమాజం లో పిల్ల లు తమ తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయడం   సర్వ సాధారణంగా  మారిందన్నారు.  అలాకాకుండా వృద్దులకు సైతం ప్రత్యెక చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్  పేర్కొన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సు అనేది ఉచితంగా న్యాయ సేవలు చేస్తారని ప్రతి ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఆసుపత్రులలో  వృద్ధులకు  సేవలందించడానికి  ప్రతేక వార్డులు,  వైద్యులు ఉంటారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు వారికే కేటాయించే సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు.  జిల్లాలో సినియర్ సిటిజన్ యాక్ట్  ఉంటుందని అదేవిధంగా  జిల్లా లో ఒక ట్రిబ్యునల్  ఉంటుందని ఈ ట్రిబ్యునల్ కు అర్దిఒ అధికారిగా ఉంటారని తెలిపారు.  వృద్దులు తమ పిల్లలనుంచి ఎదురవుతున్న సమస్యలను ఈ ట్రిబ్యునల్ ద్వార సహాయం పొందవచాన్నారు. కోర్టు కు రానవసరం లేకుండానే ట్రిబ్యునల్ లో న్యయం జరుగుతుందన్నారు. వృద్దులకు  బస్సులలో ప్రయాణించే సమయం లో వారి కి బస్సు లో ప్రత్యెక సీట్లను కేటాయించడం జరుగుతుందని, ఆసుపత్రిలలో ఓపి సమయం లో వారికి ప్రత్యేక లైన్ ను కేటాయించి వారికి త్వరితగతిన వైద్యం అందిచే సదుపాయం ఉందన్నారు. సంవత్సరానికి మూడు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులన్నారు. ప్రతి ఒక్కరు చట్టాల పై అవగాహనా పెంచుకోవాలని ఇతరులకు తెలియజేయలన్నారు.

ఈ కార్యక్రమం లో పిపి సురేష్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్, భీం రెడ్డి , ఆర్ యం ఓ డాక్టర్ ,లోక్ అదాలత్ సభ్యులు వరలక్ష్మి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post