వయో వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—1
తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యత :: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
వృద్ధుల సమస్యల పరిష్కారానికి 14567 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, అక్టోబర్ 04:-
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ స్పష్టం చేసారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లితండ్రుల పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలని వృద్దాప్యంలో తల్లితండ్రులను బాగా చూసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యత అని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు జిల్లాలో తల్లితండ్రుల, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమం చట్టం 2007 అండ్ నియమావళీ 2011 పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కుటుంబ విలువలతో భారతీయ సంస్కృతి ఏర్పడిందని, తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రత్యేకంగా చట్టం తీసుకొని వచ్చే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని కలెక్టర్ అన్నారు. వృద్దులు కనీసం ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క అర్హులకు కరోనా సంక్షోభంలో సైతం రూ.2016/- అందిస్తుందని తెలిపారు. మన రాష్ట్రంలో ఈ పథకం కింద 12.94 లక్షల మందికి ప్రతి సంవత్సరం రూ.3132.72 కోట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. తల్లిదండ్రులకు కావాల్సిన కనీస అవసరాలను పిల్లలు తీర్చాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం నేరమవుతుందని, ఈ చట్టం ప్రకారం వయోవృద్దులు తమకు ఉన్న సమస్యలు స్థానిక తహసిల్దార్ లేదా ఆర్డివో కు ఫిర్యాదు చేస్తే వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ప్రజలను కౌన్సిలింగ్ చేయాలని, తల్లిదండ్రుల పోషణ చట్టం పై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పిస్తే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం వుంటుందని అభిప్రాయపడ్డారు. తల్లితండ్రుల పోషణ చట్టం 2007 ప్రకారం పిల్లలు తల్లితండ్రులను పోషణకు వ్యతిరేకిస్తే క్రిమినల్ ప్రోసిడ్యర్ కోడ్ 125 ప్రకారం కంప్లెంట్ చేస్తే చర్యలు తీసుకొనే అవకాశం వుంటుందని అన్నారు. పోలిస్ లకు, తహసిల్దార్లకు దరఖాస్తు చేసుకుంటే ఫ్యామిలి కౌన్సిలింగ్ చేసే అవకాశం వుందని అన్నారు. ఈ చట్టం అమలుకు వచ్చిన తరువాత వృద్ధులు లేదా తల్లితండ్రులు వారి బందువులు లేదా పిల్లల పేరిట, వారి సంరక్షణ బాధ్యతను తీసుకునే నియమంతో, వారికి సంబంధించిన ఆస్తి బదలాయించిన సందర్భంలో సదరు బందువులు , పిల్లలు వారి పట్ల నిర్లక్ష్యాన్ని చూపితే దాన్ని మోసం లేదా బలవంతంగా లాక్కొవటం కింద పరిగణించి ఆ ఆస్తులను తిరిగి స్వాధినం చేసుకునే అవకాశం వుంటుందని, దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 14567 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని, ఉదయం 7 నుంచి 9 గుల వరకు నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని తెలిపారు అనంతరం వయోవృద్దులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ జిల్లా వైద్యారొగ్య అధికారి డా.ప్రమోద్ కుమార్, జిల్లా వయోవృద్ధుల కమిటీ మెంబర్ దాసరి చంద్రమౌళి, వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు పిటి స్వామి, జీవన్ రాజు మరియు సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జరిచేయబడినది.

Share This Post