వయో వృద్ధుల సంక్షేమంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

మంగళవారం నాడు కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాలులో వయో వృద్ధులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు,పరిష్కారాలు భవిష్యత్ కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి వయో వృద్ధుల కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల మరియు వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం – 2007, 2011 నిబంధనల ప్రకారం 2017 లో జిల్లాలో వయో వృద్ధుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వయో వృద్ధుల ప్రాధాన్యతను వారికి రక్షణ సంరక్షణ అందించే చర్యలు, సమస్యలు ఉత్పన్నమైనపుడు తక్షణ సహాయం కోసం తెలియచేసే టోల్ ఫ్రీ నంబర్లు వాటిపై పాఠశాల కళాశాల ఉన్నత విద్యా సంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

వయో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ ఏర్పాటు నిమిత్తం చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ లో వయో వృద్ధుల హెల్ప్ డెస్క్ ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ కమిషనర్ కు తెలియచేసి అట్టి ఆవశ్యకత పై జిల్లా సంక్షేమ అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాంకర్స్ మీటింగ్ లో సీనియర్ సిటిజన్ వారికి ప్రతి బ్యాంక్ లో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసుటకు ప్రధాన అజెండా అంశంగా చేర్చి తగు చర్యలు తీసుకునేలా చూడాలని, ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ ఎం ప్రసార మాద్యమాల ద్వారా వయో వృద్ధుల సంక్షేమం చట్టం, వారికి ప్రభుత్వం అందించే సేవలపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. టి ఎస్ ఆర్ టీ సి ఏం డి తో మాట్లాడి వయో వృద్ధులకు కేటాయించిన సీట్లలో కూర్చునేల చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పి ఎస్ 95 పెన్షనర్లకు ఆసరా పెన్షన్, తెల్ల రేషన్ కార్డు అందేలా చూస్తామని అన్నారు. వయో వృద్ధుల సంక్షేమం పట్టించుకోని వారిపై సంబంధిత ఆర్డీవో ట్రిబ్యునల్ తో చర్చించి కౌన్సిలింగ్ నిర్వహించుటకు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కలెక్టర్ అన్నారు.

సమస్యల పరిష్కారం కోరుతూ వయో వృద్ధుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ కు కోరారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి, సబిత, ఆర్ డి ఓ వాసు చంద్ర, వయో వృద్ధుల సంఘాల ప్రతినిధులు డాక్టర్ ఎ చంద్రమౌళి,రాజేంద్ర ప్రసాద్ దేవాచారి,RFO ( Rtd), సంజీవ రెడ్డి Retd SI, సత్యనారాయణ Retd ATO, నాగరాణి సీనియర్ సిటిజన్ హెల్ప్ డెస్క్, సూపింటెండెంట్ శ్రీనివాస్
సీనియర్ సహాయకులు వెంకట్ రామ్
జిల్లా బాలల పరిరక్షణ అధికారి సంతోష్ కుమార్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్
ఎఫ్ ఆర్ వో రాజు, జూనియర్ అసిస్టెంట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post