వరంగల్ అర్బన్. తేది.30.7.2021. లోతట్టు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి నివేదిక ప్రతిపాదనలు సిద్ధం చేయండి : అర్బన్ కలెక్టర్ రాజివ్ గాంధీ హన్మంతు.

ప్రెస్ రిలీజ్.
వరంగల్ అర్బన్.
తేది.30.7.2021.

లోతట్టు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి నివేదిక ప్రతిపాదనలు సిద్ధం చేయండి : అర్బన్ కలెక్టర్ రాజివ్ గాంధీ హన్మంతు.

లోతట్టు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి వచ్చే నెల 3 లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అర్బన్ కలెక్టర్ రాజివ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కాలెక్టరేట్ ఛాంబర్లో అధికారులతో కలెక్టర్ సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా నగర పాలక సంస్థ పరిధిలో వర్షాకాలంలో తరచుగా ముంపుకు గురయ్యే 28 ప్రాంతాలు గుర్తించడం జరిగిందని, వాటి శాశ్వత పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు రెవిన్యూ, బల్దియా, ల్యాండ్ సర్వే, కుడా,ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని అన్నారు.
28 ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బఫేర్ జోన్, లే అవుట్ అనుమతి లేని, ప్రభుత్వ, పట్టా, శిఖం భూముల్లో లోతట్టు ప్రాంతాల్లోని నిర్మాణాలను పరిశీలించి అట్టి వివరాలు ప్రొఫార్మలో పొందు పరుస్తూ భవిష్యత్తు లో ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వివరిస్తూ నివేదిక సిద్ధం చేయాలని, అట్టి నివేదికను శాశ్వత పరిష్కార నిమిత్తం
ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సిటీ ప్లానర్ వెంకన్న, ఎస్ ఈ సత్యనారాయణ, కుడా పి ఓ అజిత్ రెడ్డి, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ప్రభాకర్ డిసిపి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

Share This Post