వరంగల్ అర్బన్. తేది.9.8.2021. న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి పి.సి.వి. టీకా ఇప్పించాలి :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

వరంగల్ అర్బన్.
తేది.9.8.2021.
న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి పి.సి.వి. టీకా ఇప్పించాలి :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి పి.సి.వి. టీకా ఇప్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో మాట్లాడుతూ న్యుమోకోకస్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే న్యుమోనియా నుండి చిన్నారులను రక్షించుటకు త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పి.వి.సి. టీకాలు ఇవ్వనున్నామని అన్నారు. పుట్టిన ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు 11 రకాల టీకాలు ఇస్తున్నామని అన్నారు. న్యుమోనియా మనిషిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు వస్తుందని, ప్రాణ హాని జరగకుండా, ముందస్తుగా చిన్నారులకు న్యుమోనియా రాకుండా పి.సి.వి. టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. జిల్లాలో ఆరు వారాల పైబడిన వారు 19341 ఉన్నట్లు గుర్తించామని ఈ చిన్నారులందరికి టీకా ఇప్పించుటకు వరంగల్ అర్బన్ లో 66 డివిజనుల కార్పోరేట్లర్లతో, మండలంలలోని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి భాగస్వామ్యంతో అధికారులు, పంచాయత్ కార్యదర్శులు, ఏ.యెన్.ఏం. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పిల్లల తల్లి, దండ్రులకు ఆవగాహన కలిపించాలన్నారు. ఈ టీకా సంవత్సరం లోపు మూడు విడతలుగా అనగా 6 వారాలు,14 వారాలు మరియు 9నెలల వయసులో ఇవ్వబడుతుందని, ఖరైన ఈ వ్యాక్సిన్ నీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు టీకాలు ఇప్పించవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ., శ్రీనివాస్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి, వాసుచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. లలిత దేవి, పిడి డ్వామా భద్రు, డి.డబ్లు.ఓ. సభిత, డి.ఈ.ఓ., నారాయణ రెడ్డి, సి.కే.ఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నిర్మల,డి.ఐ.ఓ డా. గీత లక్ష్మి, డా. మదనమోహన్ , డా. శ్రీ కృష్ణ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

.

Share This Post