వరంగల్ అర్బన్. దళితుల భూ సమస్యలను త్వరితగతిన గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

ప్రెస్ రిలీజ్….1
తేదీ.30- 07-2021.
వరంగల్ అర్బన్.

దళితుల భూ సమస్యలను త్వరితగతిన గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

దళితుల భూ సమస్యలను త్వరితగతిన గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాలులో దళితుల భూ సమస్యలను పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ బృందాల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. దళితుల భూ సమస్యలను గుర్తించడానికి కమలాపుర్ మండలంలోని 16 రెవిన్యూ పంచాయతీలకు ఒక నాయబ్ తహశీల్దార్/ మండల గీర్దావర్/అదనపు గీర్దావర్/ సీనియర్ అసిస్టెంట్ లను స్పెషల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో సంబంధిత గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్ పర్సన్ లతో కలిసి దళితవాడలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఒక్క దళితవాడ కూడా విస్మరించకూడదు అన్నారు. దళితుల భూ సమస్యల వివరాలను వరంగల్ ఆర్డీవో, కమలపూర్ తహసీల్దార్లకు త్వరితగతిన సమర్పించాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీశ్వర్, కమలపూర్ తహసీల్దార్ జాహీద్, కమలపూర్ రెవిన్యూ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post