వరంగల్ అర్బన్. ధర్మసాగర్గ్ నిర్వహణకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ :: జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు.

ప్రెస్ రిలీజ్.
వరంగల్ అర్బన్.
ధర్మసాగర్ మండలం.
తేది.5.8.2021.

మైనింగ్ నిర్వహణకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ :: జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు.

గురువారం జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు ధర్మసాగర్ మండలం లోని దేవనూర్ జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రాగణంలో మైనింగ్ నిర్వహణకు ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దేవనూర్ గ్రామంలో మెస్సేర్స్. సివంతా మినేరో ప్రాజెక్ట్స్ ప్రయివేటులిమిటెడ్ వారు సర్వే నెం.531/పి, క్వార్ట్జ్ గని లీజు ప్రాంతం 14.63 హెక్టార్లు, సర్వే నెం.531/1పి, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ మరియు గ్రావెల్ లీజు ప్రాతం 14.90 హెక్టార్లు, సర్వే నెం.531/1పి క్వార్ట్జ్ ప్రాజెక్టు నిర్వహణ ప్రతిపాదిత కు ఎం. వెంకట్ నర్సు, ఈ ఈ రీజినల్ ఆఫీసర్, వరంగల్ తో కలసి ఎన్. జి.ఓలు, గ్రామ ప్రజలు మాట్లాడిన విషయాలు రికార్డు, లిఖితపూర్వకంగా ఇచ్చిన పర్యావరణ ప్రజాభిప్రాయలను సేకరించి తెలంగాణా రాష్ట్ర ఎన్వీరాన్మెంటల్ అసోసియేట్ కు పంపబడుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సివంతా మినేరో ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ పర్యావరణ సలహాదారు లు గుండు విజయ్ రాజ్, ఎన్. జి.ఓలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

.

Share This Post