వరంగల్ అర్బన్. రుణమాపీలో భాగంగా ఆగస్టు 16వ తేదీ నుండి 2006 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని శాసనమండలి సభ్యులు, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ శ్రీ. పల్లా రాజేశ్వర్ రెడ్డి

Media Release.
Date : 07/08/2021.

రైతు రుణమాపీలో భాగంగా ఆగస్టు 16వ తేదీ నుండి 2006 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని శాసనమండలి సభ్యులు, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ శ్రీ. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీని అయన శనివారం నాడు ప్రారంభించారు. రైతుబంధువుగా తెలంగాణ ప్రజలకు ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడలేని పథకాలను రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నారని అయన అన్నారు. ఇప్పటికే 25 వేల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 తేదీ నుండి 50 వేల లోపు రైతుల రుణాలను మాపీ చేయనుండడం వల్ల రాష్ట్రంలో రైతులకు గొప్ప ఊరట అని అన్నారు. అందుబాటులో కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, పంటల పెట్టుబడి కోసం రైతుబంధు ద్వారా ఏడాదికి ఎకరానికి 10వేల రూపాయలు, చనిపోయిన రైతులకు రైతుబీమా ద్వారా 5 లక్షలు, రుణమాపీలు,సాగునీరు, 24 గంటల నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించిన సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసారని అయన అన్నారు. అంతేకాకుండా పంటలను కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేదని అయన అన్నారు. రాష్ట్రంలో రైతుబీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అయన తెలిపారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్లు పొందడానికి కనీస వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని అయన అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ఆకాంక్ష నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం, వాటి ఫలితాల వల్ల రాష్ట్ర ప్రజలు చాల సంతోషంగా ఉన్నారని అయన అన్నారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబి) ధర్మసాగర్ బ్రాంచి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషమైన విషయమని ఆయన అన్నారు. ఈ సహకార బ్యాంకులలో పంట రుణాలే కాకుండా గృహా రుణాలు, మార్ట్ గేజ్ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు తక్కువ వడ్డీకి ఇవ్వడము గొప్ప విషయమన్నారు.
దళిత సాధికారత లక్ష్యంతో, దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన తెలంగాణ దళితబంధు కార్యక్రమం అనేది దళితుల పాలిట ఒక వరం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మర్నేని రవీందర్ రావు, ధర్మసాగర్ PACS చైర్మన్ & డీసీసీబీ డైరెక్టర్ గుండేటి రాజేశ్వర్ రెడ్డి, వేలేరు ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీలు డా.పిట్టల శ్రీలత, చాడ సరితా రెడ్డి, ధర్మసాగర్ మండల అధ్యక్షులు & మండల రైతుబంధు సమితి కన్వీనర్ సోంపేల్లి కరుణాకర్,జడ్పీ కోఆప్షన్ జుబేధా లాల్ మహమ్మద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చంద్ర , ఎంపీటీసీ బొడ్డు శోభ-సోమయ్య, PACS వైస్ ఛైర్మన్ యాద కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

.

Share This Post