వరంగల్ అర్బన్ వడ్డీలేని రుణాల లబ్దిదారుల కుటుంబాలు ఆర్ధికంగా బలపడాలి:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావు

ప్రెస్ రిలీజ్.
వరంగల్ అర్బన్ జిల్లా.
కమలాపూర్ మండలం.
తేది.7.8.2021.

వడ్డీలేని ఋణాల లబ్దిదారుల కుటుంబాలు ఆర్ధికంగా బలపడాలి:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావు

వడ్డీలేని ఋణాల లబ్దిదారుల కుటుంబాలు ఆర్ధికంగా బలపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.

శనివారం కమలపూర్ మండలంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పి చైర్ పర్సన్ డా.ఎం.సుధీర్ బాబు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లతో కలసి మంత్రి
54 గ్రామాలలోని 1470 స్వయం సహాయక సంఘాల 17వేల 255 సభ్యులకు 29 కోట్ల 51 లక్షల 23 వేల 751 విలువ గల వడ్డీ లేని రుణాలు మరియు బ్యాంకు లింకేజీ, స్ర్తినిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు దాదాపు 30 కోట్ల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రుణాలు పొందిన మహిళల సంఘాలు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. ఇంకా మిగిలిన ఐకేపీ సంఘాలకు 3 లక్షలకు తక్కువ కాకుండా 10 కోట్ల వడ్డీ లేని రుణాలు త్వరలో మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో ఉన్న సంఘాలు కారం, పసుపు తయారీ చేసుకొనుటకు మిషిన్లు కొనుగోలు ప్రణాళికలు చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఐకేపీ ద్వారా సీజన్ కు అనుకూలంగా కూరగాయలు, మామిడి, సీత ఫలలు కొనుగోలు చేసి వరంగల్ మార్కెట్ కు పంపి సంఘాలు లాభాలుపొందలన్నారు.
సంఘాల ద్వారా మహిళలకు గౌరవం పెరిగినదన్నారు. కమలపూర్ మండలం హన్మకొండ రెవిన్యూ డివిజన్ లొనే కొనసాగుతుందని, దీనిపై అపోహలను వద్దన్నారు. మహిళా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొనుటకు మండంలోని ప్రతి గ్రామములో ఒక భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల్లో 150 కోట్ల రుణాలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా రుణాలు పెంచుకుందమ్మారు. కమలపూర్ మండలంలో 7 గ్రామాల్లో మహిళా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొనుటకు భవనాలు ఉన్నయన్నారు. మిగిలిన 24 గ్రామాల మహిళ సంఘాలు చెట్ల క్రింద కూర్చొని సమావేశాలు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటనారని ప్రతి గ్రామములో ఒక భవనాన్ని నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను అభివృద్ధి లో తీసుకోవాలని ఉద్దేశ్యంతో వడ్డీ లేని రుణాలు మంజూరు
చేసిందన్నారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారిగా మన దగ్గర వడ్డీ లేని రుణాల కార్యక్రమం ప్రారంభించుకున్నామన్నారు. మహిళల ఆర్థిక శక్తి పెంపొందించు కొనుటకు ఉపయోగపడు తుందన్నారు. రుణాలు పొందిన వారు పెండింగ్ లేకుండా తిరిగి చెల్లించాలని అన్నారు. సమాజానికి ఉపయోగ పడే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
విద్యావంతులు టెక్నాలజీ తో ఆర్థికలాభం వచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను ఏర్పాటు చేయలని అన్నారు. గత అనుభవం తో ఇచ్చిన రుణాలు ను సక్రమంగా ఉపయోగించుకోవలన్నారు. అకౌంట్ బుక్కులు, రికవరీ రిజిస్ట్రార్ లు సరిగా పొందుపర్చలన్నారు.

పరకాల శాసన సభ్యులు చల్ల ధర్మరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ స్కిం పెట్టిన మహిళలకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఉంటాయన్నారు.
దళిత వాడల్లో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో దళిత బంధు పథకం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, జెడ్ పి టి సి కళ్యాణి, ఎంపీటీసీ రాధిక, వైస్ ఎంపీపీ శైలజ, ఎంపీడీవో పల్లవి, సర్పంచ్ విజయ, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post