వరంగల్ అర్భన్::తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ .


గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో లబ్ది పొందాలనే ధృఢ సంకల్పంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించారు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డులు జారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ పశ్చిమ నియెజకవర్గంలో బాలసముద్రం లోని సామ జగన్మోహన్ స్మారక భవన్ మరియు మచిలీబజార్ కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అధితులుగా పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. కార్యక్రమంలో చీఫ్ విప్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డులు అందిస్తున్నాము. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలుపుతూ నిరుపేదలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు…

Share This Post