వరంగల్
వరంగల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
బుధవారం రోజున వర్ధన్నపేట ఎస్సీ కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు
కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుచున్న విధానం పైన సరైఐనా సలహాలు చేస్తూ కంటి వెలుగు కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఏమైనా కేంద్రాలలో సమస్యలు ఉంటేనే జిల్లా కంటి వెలుగు ఎమర్జెన్సీ మానిటరింగ్ సెల్ సెంటర్ నుండి పరిష్కారాలు చేస్తున్నామని తెలిపినారు.
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా తీసుకోవలసిన సేవలు గురించి తెలుసుకొని, సరైన సేవలు పొందాలని కోరారు .