వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటి0చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

For Scrolling/Breaking
Media Release
Date-14-05-2022

వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటి0చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి

కోట్లాది రూపాయల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, బిటి రోడ్లు తదితర పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి

మంత్రికి మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికిన మహిళలు, ఆయా గ్రామాల ప్రజలు

పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు

రాయపర్తి మండలం జేతురాం తండాలో 25లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు, 3 లక్షల విలువ చేసే సీసీ డ్రైనేజ్ లు, 20 లక్షలు విలువ చేసే మెటల్ రోడ్లు, 30 లక్షలు విలువ చేసే CRR రోడ్లు రాయపర్తి నుండి రావుల తండా వరకు శంకుస్థాపన, 18 లక్షలు విలువ చేసే bt రోడ్ నుండి జేతురాం తండా వరకు శంకుస్థాపన

రాయపర్తి మండలం కేంద్రంలో 9 కోట్ల 10 లక్షల విలువ చేసే పనులు రకరకాల సీసీ రోడ్లు, డ్రైనేజీ, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు.

అలాగే,
రాయపర్తి మండలం రాగన్న గూడెంలో 20లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు, 3 లక్షల విలువ చేసే సీసీ డ్రైనేజ్ లు, కాగా, మండలం పెర్కేడులో 65 లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు, 9 లక్షల విలువ చేసే సీసీ డ్రైనేజ్ లు, 15 లక్షలు విలువ చేసే మెటల్ రోడ్లు, 60 లక్షలు విలువ చేసే CRR రోడ్లు పెర్కేడు నుండి మహబూబ్ నగర్ x రోడ్ వరకు బీటీ road శంకుస్థాపన, 8 లక్షలు విలువ చేసే మహిళ సమైక్య భవనం ప్రారంభం, 6 లక్షలు విలువ చేసే హైమాస్ట్ లైటింగ్ ప్రారంభం చేశారు.

ఇక రాయపర్తి మండలం రాగన్న గూడెంలో 20లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు, 3 లక్షల విలువ చేసే సీసీ డ్రైనేజ్ లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఆయా చోట్ల వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి ప్రజలతో మంత్రి మాట్లాడారు.

కిరికిరి చేష్టలు, బోగస్ మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని పాలించింది

బీజేపీ అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదు. అబద్ధాలు చెప్పి అధికారంలో ఉంటున్నది

ఈ రెండు పార్టీలతో ఊదు కాలదు… పీరు లేవదు.

ఆ రెండు పార్టీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే

కూట్లే రాయి తీయనోడు, ఏట్లే రాయి తీస్తాడా?

వాళ్లు పాలించే రాష్ట్రాల్లో చేతగాదు కానీ, ఇక్కడ అద్భుతంగా పాలన చేస్తున్న తెలంగాణలో ఏదో చేస్తామని బొంకుతున్నరు

ఇక్కడ మాటలు చెప్పుడు కాదు. ముందుగా వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఏదైనా చేసి చూపించమనండి

తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు ఏది చెబితే అది నమ్మడానికి అన్నారు.

రాయపర్తి మండలాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. కెసిఆర్ గారు సీఎం అయ్యాక అభివృద్ధి ఎలా జరుగుతున్నదో చూస్తున్నాం. కరీం నగర్ లోయర్ మానేరు డ్యాం నీరు మనకు అందక పోయేది. కానీ, ఇవ్వాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు ఇక చాలు అనే వరకు నీళ్ళు ఇస్తున్న ఘనత సీఎం కెసిఆర్ ది. కరెంట్, నీళ్ళు, ఎదురు పెట్టుబడి ఇచ్చిన ఘనత మన సీఎం కెసిఆర్ ది కాదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరో కొందరు చేసే దుష్ప్రచారం నమ్మొద్దు. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో చేసి చూపించి మాట్లాడాలి. కేంద్రం నల్ల చట్టాలు తెస్తే వ్యతిరేకించిన ఘనత కూడా సీఎం దే. తన బొ0దిలో ప్రాణం ఉన్నంత వరకు మన రైతాంగ మోటార్ల కు మీటర్లు పెట్టనివ్వనని చెప్పాడు. ఇంతగా రైతుల కోసం పరితపించే సీఎం ను నేను నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో చూడలేదు.
మీ అందరి దయవల్ల 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గా గెలిచాను. సీఎం కెసిఆర్ గారి దయవల్ల మంత్రి అయ్యాను. మంత్రి గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేనన్నారు

గ్రామాల అభివృద్ధితో నే, దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇదే స్ఫూర్తి తో సీఎం కెసిఆర్ పరిపాలన చేస్తున్నారు. అందరినీ సంతృప్తి పరచడం అమ్మా నాయినలకే సాధ్యం కాదు. కాబట్టి ఒక్కొక్కటిగా అన్నీ పనులను పూర్తి చేసుకుందాం. మీ అభివృద్ధి నా బాధ్యత. దయన్న గా మీ అందరినీ కాపాడుకుంటాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
————————-
ప్లీజ్ కవర్

Share This Post