పత్రికా ప్రచురణార్థం
తేదీ 24 మార్చి 2023
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ _ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమాలను ఐఎంఏ హాలు నందు నిర్వహించడం జరిగినది. ముందుగా డాక్టర్ కే వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారిచే గోపాలస్వామి గుడి నుండి ఎంజి ఎం సర్కిల్ వరకు ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగినది.
అనంతరం ఐఎంఏ హాలు నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన ప్రపంచ క్షయ వ్యాధి నివారణ పై సమావేశం జరిగినది .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వరంగల్ శ్రీమతి ప్రావీణ్య IAS గారు మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారించడంలో ప్రతి ఒక్కరు సమన్వయంతో సహకరించుకొని క్షయ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి వారికి సత్వరమే చికిత్స అందించాలని కోరినారు. క్షయ వ్యాధిగాస్తులకు అందించవలసిన పోషణ అభియాన్ భృతిని సమయానికి అందించాలని కోరినారు.
డాక్టర్ కే వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రపంచ క్షయవ్యాధి నివారణ ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము, ఈ సంవత్సరము ఔను మనం టీబి ని అంతం చేయగలం” సామూహిక పోరాటమే టీబి అంతానికి నాంది . ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు ప్రతి ఒక్కరు నిరంతరము శ్రమిస్తూ టిబి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తూ వారికి సేవలందిస్తున్నారని తెలిపినారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీబి వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సహాయముతో ఉచితంగా పరీక్షలు చేయించుకొని డాక్టర్లు నిర్దేశించిన ప్రకారము చికిత్సలు తీసుకోవాలని తెలిపినారు . డాక్టర్ సుదర్ సింగ్ జిల్లా టీబి అధికారి మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతతో టిబి నివారణ ద్వేయంగా పాటిస్తూ ఉండాలని కోరినారు .టీబి ని 2025 నాటికి అంతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉన్నదని తెలుపుతూ టీవీ సాధారణంగా మైక్రో బాక్టీరియా Tuberculosis అనే బ్యాక్టీరియా వలన ప్రతి ఒక్కరికి అంటుకునే వ్యాధి అని తెలిపినారు .టీబి కి పురుషులు’ మహిళలు, పిల్లలు ధనిక ,పేద అనే భేదం లేకుండా ఎవరికైనా రావచ్చునని తెలిపినారు. మన వరంగల్ జిల్లాలో 25 ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమము జరుగుతుందని, దగ్గు, జ్వరం , బరువు తగ్గడం ,ఆకలి లేకపోవడం వలన లక్షణాలు ఉంటే వెంటనే టిబి పరీక్షలు చేయించుకోవాలని కోరినారు. మన వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రిలో సామాజికఆరోగ్య కేంద్రం వర్ధన్నపేటలో ట్రూనాట్ యంత్రాన్ని, ప్రభుత్వ దావఖాన నర్సంపేట ఆరోగ్య కేంద్రంలో సి బి నాట్ యంత్రాన్ని అమర్చి అధునాతనమైన పద్ధతిలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడమే జరిగినదని తెలిపినారు . ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపినారు. నేటి వరకు మన వరంగల్ జిల్లాలో 1114 ప్రభుత్వ రంగంలో 356 ప్రైవేట్ రంగంలో మొత్తము 1470 వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నామని తెలిపినారు. అనంతరం టిబి వ్యాధి కొరకు ఉన్నతమైన సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రములు సీల్డ్స్ ద్వారా సన్మానం చేయడం జరిగినది .ఉన్నతమైన సేవలు అందించిన ఉద్యోగులు డాక్టర్ అనిత, డాక్టర్ సరోజ, ఎస్ టి ఎల్ ఎస్ రంజిత్ ,స్వరూప, సాంబయ్య, మ, కవిత, అర్చన నితిన్ రెడ్డి, సునీత మొదలగు వారికి కలెక్టర్ గారిచే ప్రశంసా పత్రములు సీల్డ్స్ ద్వారా సత్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా టీబి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుదార్ సింగ్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ గోపాలరావు, డాక్టర్ ప్రకాష్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్, ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్, హెచ్ఓడి మెడిసిన్ డాక్టర్ బిక్షపతి రావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కస్తూరి ప్రమీల, ART సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సూర్య ప్రకాష్ , డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ,డి పి హెచ్ ఎన్ ఓ జ్ఞాన సుందరి ,స్పందన కళాబృందం ,శాంభవి మహిళా మండలి, ఎంజిఎం నర్సింగ్ స్టూడెంట్స్, వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ క్యాడర్ల ఉద్యోగులు మరియు తదితరులు పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగినది.
DMHO
Warangal
దీని ప్రతులు డి పి ఆర్ ఓ వరంగల్ గారికి అన్ని పత్రికల నిమిత్తము సమర్పించినది