వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం భవన నిర్మాణానికి కావలసిన భూమి సేకరణ పై సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

హన్మకొండలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్లో సోమవారం నాడు వరంగల్ జిల్లా కలెక్టర్ హరిత,రెవెన్యూ అధికారులతో కావలసిన భూమి సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

వరంగల్ రూరల్ జిల్లా స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా ఏర్పడి నందున జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావలసిన భూమిని వెంటనే సేకరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, అందువల్ల వెంటనే సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావాల్సిన భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

భూసేకరణలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో RDO మహేందర్ జీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Share This Post