*ప్రెస్ రిలీజ్*
*హనుమకొండ*
*ఏప్రిల్ 26*
*వరంగల్ నగర్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము*
*కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి*
వరంగల్ నగర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం నాడు కేంద్ర పర్యట శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్- హన్మకొండ భద్రాకాళీ దేవాలయం అమ్మ వారిని, వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, ఈఓ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి రుద్రేశ్వరుడి అభిషేకం చేసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం మంత్రికి ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి పట్టు వస్త్రాలు బహూకరించిన దేవాలయం అర్చకులు.
ఈ సందర్భగా ఆయన దేవాలయ ఆవరణలో మీడియా తో మాట్లాడుతూ దేశంలో వరంగల్ జిల్లాకు మంచి గుర్తింపు ఉందని కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన వారసత్వ సంపదను పరి రక్షణ కోసం భారత ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేస్తూన్నట్లు తెలిపారు.కాకతీయుల కట్టడా లను సంరక్షణ కు అన్ని చర్యలు తీసుకుంటాం అని అన్నారు
అందులో భాగంగానే నగరాన్ని *హెరిటేజ్, స్మార్ట్ సిటీ* గా ప్రకటించిందని రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇతర దేశాల అధ్యక్షులు, విదేశాంగ, సాంసృతిక సిబ్బందితో మాట్లాడి గుర్తింపుకు సహకరించారని తెలిపారు.
దేశానికే తలమానికమైన కట్టడం వెయి స్థంభాల దేవాలయమని దానిని రక్షించుకొనేందుకు 15 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
మడపం నిర్మాణం, పర్యాటకుల సౌకర్యార్థం గ్రినరి, పార్క్, ఇతర పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు.
పనుల పురోగతిని పర్యవేక్షించడానికి స్వయంగా మూడవ సారి దేవాలయాన్ని సందర్శిచినట్లు తెలిపారు.
రామప్ప దేవాలయం అభివృద్ధికి .3.70 లక్షలు, మంజూరు చేస్తున్నట్లు పర్యటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు సుమారు 50. నుండి 60 కోట్లతో రెస్టారెంట్లు, క్యాంటీన్, వసతి గృహాలు, *ప్రసాద్ స్కీమ్ క్రింద* పనులు చేస్తున్నాట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం రాముల వారి దేవాలయం, జోగులాంబ దేవాలయం అభివృద్ధికి అవసరమైన 33 కోట్లు మంజూరు చేసి 5 కోట్లు వెంటనే ఇచ్చినట్లు తెలిపారు.
ములుగు ప్రాంతంలో *ట్రైబల్ సైకుట్* పేరుతో 100 కోట్లతో
అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రం 2.50 లక్షలు మంజూరు చేసిన విషయం గుర్తుకు చేశారు..
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది. పాల్గొన్నారు.