వరంగల్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాధోడ్ లు పేర్కొన్నారు.

ఆదివారం నాడు హనుమకొండ వేదికగా జవహర్ లాల్ నెహ్రు స్టేడియం లో జరిగిన 60 వ నేషనల్ ఓపెన్ అధ్లెటిక్స్ ఛాంపియన్స్ సంబరాలు ఆదివారం ఘ‌నంగా ముగిశాయి. ఐదు రోజులపాటు ఉర్రూతలూగించిన ఈ ఆట‌ల పండుగ‌.. క్లోజింగ్ సెర్మ‌నీ ముగిసిట్లు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ వేదిక పై ప్రకటించారు. విజేతలకు ట్రోఫీలు అందించారు. రంగురంగుల విద్యుత్‌ దీపాల మధ్య బాణాసంచా వెలుగులతో స్టేడియం కళకళలాడింది. వివిధ క్రీడా అంశాలలో పోటీపడిన క్రీడాకారులతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది.జోరు వానలో సైతం క్రీడాభిమానులు పెద్ద సంఖ్య లో హాజరైయ్యారు . సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూవరంగల్ క్రీడలకు పెట్టింది పేరని అన్నారు.క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఐదువందల ఎకరాల భూమిని సేకరిస్తామని అన్నారు.జాతీయ క్రీడలు మరిన్ని నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా ఇక్కడ స్పూర్తిదాయకమైన మంచి కార్యక్రమం జరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసిఆర్ క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు .జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడ నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పించారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ వంటి విశిష్టమైన నగరంలో ఈ క్రీడలు నిర్వహించడం సంతోషదాయకం అని అన్నారు. క్రీడాకారులకు వరంగల్లో వేదిక ఉండాలని అన్నారు. ఈ క్రీడల విజయవoతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్ రావు, కార్యదర్శి సారంగఫణి,DYSO అశోక్ కుమార్, TGO అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ A. జగన్మోహన్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post