వరంగల్ రూరల్ కలెక్టరేట్లో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి.

ఆదివారం వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర వేడుకలు కోవిడ్ నిబంధనల ప్రకారం జరిగాయి, ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.హరిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తదుపరి కలెక్టర్ పోలీసు వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు, అనంతరం జిల్లా అధికారులు కలెక్టర్కు స్వతంత్ర దినోత్సవ అభినందనలు తెలిపారు.జిల్లా కలెక్టర్ చాంబర్లో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా గణాంక వివరాలు తెలుపు పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల యొక్క వివరాలు సేకరించి జిల్లా గణాంక వివరాలు తెలుపు పుస్తకం తయారు చేసినందుకు జిల్లా కలెక్టర్ సి.పి .ఓ జీవరత్నంను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ ,కలెక్టరేట్ రాజేంద్రనాథ్, ఆర్డిఓ మహేందర్.జి, సీఈఓ రాజారాం, సిపిఓ జీవరత్నం, గణాంక అధికారి కే.ఉష, ప్రభాకర్, సుభాష్, రమేష్ చంద్ర, మరియు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post