గురువారం మండలంలోని శివాజీ నగర్ ,నాచిన్న పల్లి, పొనగల్, లక్ష్మీపురం గ్రామాలలో కలెక్టర్ పర్యటించి నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో అధికారులు చేపట్టిన కార్యక్రమాలను, గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముందుగా శివాజీ నగర్ లో పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటిక ,డంపింగ్ యార్డ్ లను కలెక్టర్ పరిశీలించారు.
పల్లె పకృతి వనం నిర్వహణ చాలా బాగుందని గ్రామ కార్యదర్శి ని సర్పంచ్ ని గ్రామస్తులను కలెక్టర్ అభినందించారు.
అనంతరం పల్లె ప్రకృతి వనం లో కలెక్టర్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సోలార్ లైట్లు మరియు కరెంట్ మోటర్ కావాలని కలెక్టర్ ని కోరగా పనుల యొక్క ప్రతిపాదనలు పంపాలని తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అక్కడ నుండి నాచిన పల్లి గ్రామాల్లోని రోడ్డుకు ఇరువైపులా వేసిన మొక్కలను చూసి కలెక్టర్ అధికారులను అభినందించారు.
పిదప ఎస్సీ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ని పరిశీలించిన కలెక్టర్ మొక్కలు తక్కువగా ఉండటాన్ని గమనించి మొక్కలు నాటాలని కార్యదర్శి మరియు సర్పంచులను కలెక్టర్ ఆదేశించారు.
పొనకల్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనంని కలెక్టర్ పరిశీలించారు.
తరువాత ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు సిసి రోడ్లను కావాలని కలెక్టర్ కు విన్నవించగా, స్పందించిన కలెక్టర్ వెంటనే ఎస్టిమేషన్ వేసి పంపాలని ప్రభుత్వం ఎస్సీ కాలనీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని దానిద్వారా పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.


